నక్క ఉపాయం
ఒక అడవి. ఆ అడవిలో ఒక నక్క. వేటాడే సమయంలో రాళ్ళలో కాలు ఇరుక్కుపోయి, ఒక కాలు సరిగ్గా నడవడానికి రాదూ. అప్పటి నుండి ఆ నక్క ఏ జంతువుని వేటాడలేక, తిండి తిప్పలులేక బక్కగా అయిపోయి బ్రతుకుతుంది. నక్క ఇలా అయితే కష్టం! ఒక జంతువుని చంపి తింటే గాని బ్రతకను అనుకుని..నాకు కాలు పోతే పోనీ, బుద్ధి ఉంది కదా అని వెంటనే కుంటుకుంటూ వేటకు బయల్దేరింది. ఆలా అడవిలో జంతువులని వెతుకుతూ వెతుకుతూ ఏనుగులు లేడిపిల్లలు కుందేళ్లు గడ్డి మేసే పచ్చిక బయళ్ళ ప్రాంతానికి చేరుకుంది. అనుకున్నట్టే ఎన్నో జింకలు కుందేళ్లు కనబడ్డాయి.వాటిని చూడగానే నక్క నోరు ఊరింది.. ఏదో ఒక జంతువును ఈ రోజు లొట్టలు ఏసుకుంటూ తింటాను అని ఒక ఉపాయం అలోచించి జంతువుల ముందు చనిపోయినట్టు పడుకుంది. దగ్గరికిరాగానే పట్టుకొని చంపితినాలి అని దాని ఉపాయం. ఆలా ఆ నక్క పడుకోవడం చూసి జంతువులు కాసేపటికి నక్క చనిపోయింది అనుకున్నాయి. కానీ ఒక ఏనుగు నక్క చెవులు కదలడం గమనించింది. ఈ నక్కకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకుంది .వెంటనే మిగతా జంతువులకి నక్కకి వినబడేలా" మిత్రులారా! ఈ నక్క చనిపోయింది! మన అడవి ఆచారం ఏ జంతువు చనిపోయిన ఆ జంతువు పక్కన మనం అంత ఆ రాత్రి నిద్రించాలి. అప్పుడే ఆ జంతువు ఆత్మ శాంతిస్తుంది అని " ఆ మాటలు వినగానే నక్క తన ఉపాయం పనిచేసింది. నిద్రపోతుండగా నచ్చిన జంతువును తినొచ్చు అని అనుకుంది. లోపల ఎంతో సంతోసంగా ఉంది. అంతలో ఏనుగు" ఈ నక్కపై ఈగలు , దోమలు వాలుతున్నాయి..ఏదైనా ఆకులు వేయండి." అని ఎండిన ఆకులు పైన వేసి జంతువులన్నీ రెండు రాళ్లతో నిప్పు తాయారు చేసి ఆ ఎండు ఆకుల్ని అంటించాయి.. మెల్ల మెల్లగ నిప్పు పెద్దగై నక్కకు శ్వాస ఆడక ..భరించలేక ఆ నిప్పుల్లో నుండి బయటపడి ..ప్రాణభయంతో అడవిలోకి పరుగెత్తింది. ఇంకెప్పుడు జంతువుల జోలికి వెళ్లకుండా అడవి పక్కన ఉన్న పంట పొలాల్లో పీతలు ఏరుకుంటూ బ్రతుకు సాగించింది." పిల్లలు ఈ కథలో నీతి ఏంటి ?
0 Yorumlar